పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 138వ ర్యాంక్పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ 138 ర్యాంకులో నిలిచింది. గత ఏడాది 136 వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది రెండు ర్యాంకులను కోల్పొయింది. సంపూర్ణ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశంగా నార్వే రెండో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలవగా, ఉత్తరకొరియా చివరి స్థానంలో ఉంది. వివిధ అంశాల ఆధారంగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) అనే అంతర్జాతీయ సంస్థ 180 దేశాల్లో ఉన్న పత్రికా స్వేచ్ఛకు ర్యాంకులు ప్రకటించింది. భారత్‌లో హిందూమత ఆధిక్యత, కుల వ్యవస్థ, మహిళా హక్కులపై ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాతోపాటు జర్నలిస్టులపై బెదిరింపులు, భౌతిక దాడులు ఎక్కువయ్యాయని ఆర్‌ఎస్‌ఎఫ్ నివేదిక పేర్కొంది.
ప్రతినెల 30న సివిల్ రైట్స్ డే
జిల్లా కేంద్రాల్లో ప్రతినెల 30న ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీల ఆధ్వర్యంలో ఈ డే నిర్వహించాలని ఏప్రిల్ 28 జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిని మండల, గ్రామ స్థాయిలో నిర్వహించడం వల్ల ప్రజల సమస్యలపై యంత్రాంగానికి స్పష్టత రావడంతో పాటు పథకాల అమలులో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
దాల్మియాకు ఎర్రకోట నిర్వహణ బాధ్యతలు
చారిత్రక కట్టడాలైన ఎర్రకోట, గండికోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 28న కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎర్రకోట, గండికోట నిర్వహణకు రూ. 25 కోట్లను ఆ సంస్థ ఖర్చు చేస్తుంది. అందుకు బదులుగా వాటిని దాల్మియా సంస్థ ప్రచారానికి ఉపయోగించుకుంటుంది. కట్టడాల నిర్వహణ కాంట్రాక్టుల జాబితాలో కుతుబ్ మినార్ (ఢిల్లీ), హంపి (కర్ణాటక), సూర్య దేవాలయం (ఒడిశా), అజంతా గుహలు (మహారాష్ట్ర), చార్మినార్ (తెలంగాణ), కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) వంటి 95 ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి.
చారిత్రక కట్టడాల నిర్వహణలో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యాన్ని తీసుకొచ్చెందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ (ఓ చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకోండి)’ పథకాన్ని ప్రవేశపెట్టింది.

No comments:
Post a Comment